: ఢిల్లీలో శ్రీలంక ప్రధాని రనిల్‌ విక్రమ్‌సింఘే

శ్రీలంక ప్రధానమంత్రి రనిల్‌ విక్రమ్‌సింఘే ఈరోజు ఢిల్లీ చేరుకున్నారు. భార‌త్‌లో ఆయ‌న‌ మూడు రోజుల పాటు ప‌ర్య‌టించ‌నున్నారు. త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రేపు ఆయన భార‌త ప్రధానమంత్రి నరేంద్రమోదీతో చర్చిస్తారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపుతారు. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో పాటు కేంద్ర‌మంత్రులు నితిన్‌ గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్‌ల‌తో కూడా ఆయ‌న భేటీ కానున్నారు. ఎల్లుండి భారత ఆర్థిక సదస్సు ప్రారంభం కానుంది. ఆ స‌ద‌స్సును ప్రారంభించేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి విక్ర‌మ‌సింఘే పాల్గొంటారు. ఇస్లామాబాద్‌లో వ‌చ్చేనెల జ‌ర‌గ‌నున్న సార్క్ స‌ద‌స్సును భారత్ బ‌హిష్క‌రించిన త‌రువాత ప‌లు దేశాల‌తో పాటు ఇటీవ‌లే శ్రీలంక కూడా బ‌హిష్క‌రించిన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో విక్ర‌మ‌సింఘే ప‌ర్య‌ట‌న ప్రాధాన్య‌త‌ సంతరించుకుంది.

More Telugu News