: సింధు జలాల ఒప్పందం రద్దుకు మేం వ్యతిరేకం.. నదులు యద్ధ క్షేత్రాలు కాదు: మేధాపాట్కర్

నదులు యద్ధ క్షేత్రాలు కాదని, సింధు జలాల ఒప్పందం రద్దుకు తాము వ్యతిరేకమని నర్మదా బచావ్ ఆందోళన్ వ్యవస్థాపక సభ్యురాలు మేధాపాట్కర్ అన్నారు. సింధు జలాల ఒప్పందం రద్దుకు తాము పూర్తి వ్యతిరేకమని ఆమె పేర్కొన్నారు. జల యుద్ధాలకు తాము అంగీకరించబోమన్నారు. నదులు యుద్ధ క్షేత్రాలు కాదని, వాటిని రాజకీయాలకు ఉపయోగించుకోవద్దని సూచించారు. నిజానికి దేశ అవసరాల కోసమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్టు ప్రభుత్వాలు చెబుతుంటాయని, కానీ నిజానికి వాటి వల్ల బాగుపడేది మాత్రం వ్యాపార వర్గాలేనని ఆరోపించారు. చిన్నచిన్న డ్యాముల నిర్మాణం వల్లే పేదలకు, పర్యావరణానికి మేలు జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.

More Telugu News