: నేడు రద్దయిన రైళ్లు ఇవే.. ప్రకటించిన రైల్వే శాఖ

వర్షాల కారణంగా శుక్రవారం కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. అలాగే రేపటి నుంచి నూతన రైల్వే టైంటేబుల్ అమల్లోకి రానుంది. కొత్తగా ప్రవేశపెట్టిన 13 నూతన రైళ్లు, ఫ్రీక్వెన్సీ పెంచిన రైలు, పొడిగించిన 4 రైళ్లు, నంబర్లు మారిన 4 రైళ్లు, వేళలు మారిన 115 రైళ్లు, ప్రయాణ రోజులు మారిన ఆరు రైళ్లు, వేగం పెరిగిన 62 రైళ్లు, కొత్తగా కమర్షియల్ స్టాప్‌లు పొందిన 46 రైళ్ల వివరాలను నూతన టైంటేబుల్‌లో పొందుపరిచినట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం.ఉమాశంకర్ తెలిపారు. రద్దయిన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. * విజయవాడ-సికింద్రాబాద్: ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్(12795) * సికింద్రాబాద్-విజయవాడ: ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్(12796) * కాచిగూడ-గుంటూరు: డబుల్ డెక్కర్ (22118) * గుంటూరు-కాచిగూడ: డబుల్ డెక్కర్(22117) * గుంటూరు-వికారాబాద్: పల్నాడు ఎక్స్‌ప్రెస్(12747) * వికారాబాద్-గుంటూరు: పల్నాడు ఎక్స్‌ప్రెస్(12748) * గుంటూరు-మాచర్ల: ప్యాసింజర్(57317) * మాచర్ల-నడికుడి: ప్యాసింజర్(57324) * నడికుడి-మాచర్ల: ప్యాసింజర్(57323) * మాచర్ల-గుంటూరు: ప్యాసింజర్(57320) * గుంటూరు-మాచర్ల: ప్యాసింజర్(57319)

More Telugu News