: యుద్ధం తప్పదు... మాజీ మిగ్ పైలట్, టీఎస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో 20 ఏళ్ల సుదీర్ఘ సేవలు అందించిన వ్యక్తిగా ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం తప్పదనిపిస్తోందని యుద్ధవిమానం మిగ్ పైలట్ గా పని చేసిన తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇలాంటి ఆపరేషన్లలో నాణ్యమైన పరికరాలతో, అద్భుతమైన ప్రణాళికతో, క్లిష్టమైన, అనితరసాధ్యమైన సామర్థ్యంతోనే విజయాలు సాధ్యమవుతాయని ఆయన అన్నారు. నైట్ విజన్ గాగుల్స్, జీపీఎస్ పరికరాలు, నాణ్యమైన ఆయుధసామాగ్రితో ఇలాంటి కార్యక్రమాలు చేపడతారని ఆయన చెప్పారు. ఉపగ్రహాల సహాయం, నిఘా వర్గాల సాయంతో తీవ్రవాదుల కదలికలు గుర్తించి వారి అంతు చూస్తారని ఆయన తెలిపారు. యుద్ధం సమయాల్లో శబ్దవేగానికి రెండు రెట్ల వేగంతో విమానాలను నడపాల్సిన అవసరం ఉంటుందని, ఆ సమయంలో క్షణాల్లో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంతో పాటు సాంకేతిక, యుద్ధ అంశాలపై పూర్తి స్థాయిపట్టు అవసరమని ఆయన చెప్పారు. అయితే మన దేశానికి కావాల్సినన్ని వనరులు ఉన్నాయని ఆయన తెలిపారు.

More Telugu News