: పోలవరంపై నాబార్డుతో కుదిరిన ఒప్పందం.. అక్టోబరు 15న తొలి విడత రుణం విడుదల

పోలవరం ప్రాజెక్ట్ కు పూర్తి స్థాయి నిధులు అందించేందుకు నాబార్డుతో నేరుగా ఒప్పందం కుదిరింది. తొలి విడత రుణం అక్టోబర్ 15వ తేదీన అందనుంది. ఈ మేరకు నాబార్డ్, పోలవరం జాతీయ అథారిటీకి మధ్య ఒప్పందం కుదిరింది. ఈరోజు ఢిల్లీలో జరిగిన సమావేశంలో కేంద్రమంత్రులు, జలవనరులు, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్ట్ అంచనా వ్యయం, నిధుల సమీకరణపై చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ, ఎఫ్ఆర్ బీఎంతో ఈ రుణానికి సంబంధం లేదని, ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు నిధులున్నాయని, చెప్పిన సమయానికి ‘పోలవరం’ పూర్తి చేస్తామని అన్నారు. కాగా, పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కొత్తగా 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.

More Telugu News