: గ్రహాంతరవాసుల అన్వేషణకు భారీ టెలిస్కోప్.. రంగంలోకి దించిన డ్రాగన్ కంట్రీ

గ్రహాంతరవాసుల అన్వేషణకు రూ.12 వేల కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి రూపొందించిన భారీ టెలిస్కోప్‌ను చైనా ఆదివారం రంగంలోకి దించింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ టెలిస్కోప్ దాదాపు 30 ఫుట్‌బాల్ మైదానాలంత పరిమాణంలో ఉంటుంది. ఈ టెలిస్కోప్‌లో 4450 ప్యానెల్ రిఫ్లెక్టర్లను ఉపయోగించారు. వీటిని తయారుచేసేందుకు కంపెనీ చుట్టుపక్కల నివసిస్తున్న 8వేల మందిని ఖాళీ చేయించాల్సి వచ్చింది. నిర్వాసితుల కోసం అక్కడికి పది కిలోమీటర్ల దూరంలో 600 అపార్ట్‌మెంట్లు కట్టి ఇచ్చారు. విశ్వంలో మరెక్కడైనా జీవం ఉందా? ఉంటే ఎక్కడ, ఏ రూపంలో ఉంది? అనే విషయాలను నిర్ధారించేందుకే ఈ టెలిస్కోప్‌ను ఏర్పాటు చేశారు. 2011లో భారీ టెలిస్కోప్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన డ్రాగన్ కంట్రీ సరిగ్గా ఐదేళ్ల తర్వాత దానిని ప్రారంభించడం విశేషం.

More Telugu News