: తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక

భారీ వర్షాలతో ఇప్పటికే అతలాకుతలమవుతున్న తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. విదర్భ, ఉత్తర తెలంగాణ, దక్షిణ చత్తీస్‌గడ్‌లపై అల్పపీడనం కేంద్రీకృతమై ఉండడంతో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వైకే రెడ్డి తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించింది.

More Telugu News