: సిల్క్‌స్మిత ఆత్మహత్యకు రెండు దశాబ్దాలు.. నివాళులర్పిస్తున్న అభిమానులు

సిల్క్‌స్మిత.. తెలుగు సినీ రంగంలో పరిచయం అక్కర్లేని పేరు. తన నటన, హావభావాలతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసిన స్మిత సెప్టెంబరు 23, 1996లో ఆత్మహత్య చేసుకుని సినీ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. 1980-90లలో దక్షిణాది సినిమాను ఓ ఊపు ఊపేసిన స్మిత స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు. 1979లో ‘వండిచక్రం’ అనే తమిళ సినిమాతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన విజయలక్ష్మి.. సిల్క్‌స్మితగా మారింది. అంచెలంచెలుగా ఎదుగుతూ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఐటెం పాటలకు కొత్త ఒరవడిని ఆపాదించింది. అప్పట్లో ఆమె లేని సినిమాను అభిమానులు ఊహించలేకపోయేవారు. తన సినీ ప్రస్థానం తారస్థాయిలో ఉన్న సమయంలో ఆత్మహత్య చేసుకుని అందరికీ షాకిచ్చింది. వెండితెరకు ఆమె దూరమై రెండు దశాబ్దాలు అయినా అభిమానులు మాత్రం ఆమెను ఇంకా మరిచిపోలేదు. ప్రతీ సంవత్సరం ఆమె వర్ధంతి రోజున నివాళులు అర్పిస్తూనే ఉన్నారు. పోస్టర్లు వేయించి ఆమెను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.

More Telugu News