: ముందు ఉగ్రవాదాన్ని అరికట్టండి.. ఆ తర్వాతే క్రికెట్: ‘పాక్’పై గంగూలీ వ్యాఖ్యలు

పాకిస్థాన్ లాంటి ఉగ్రవాద దేశంతో క్రికెట్ ఆడేది లేదంటూ బీసీసీఐ ప్రెసిడెంట్ అనురాగ్ ఠాకూర్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ గంగూలీ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూకాశ్మీర్ లోని యూరీ సెక్టార్ లో జరిగిన ‘ఉగ్ర’ దాడి నేపథ్యంలో పాకిస్థాన్ పై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో పాకిస్థాన్ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని, ‘పాక్’ ముందుగా ఉగ్రవాదాన్ని అరికట్టాలని, ఆ తర్వాతే ఆ దేశంతో క్రికెట్ ఆడతామని గంగూలీ వ్యాఖ్యానించారు. అయితే, రెండు దేశాల మధ్య క్రికెట్ జరగకపోవడం మంచిది కాదని... ప్రస్తుత పరిస్థితుల కారణంగా బీసీసీఐ ఇలాంటి నిర్ణయం తీసుకును ఉంటుందని గంగూలీ పేర్కొన్నాడు.

More Telugu News