: జర్నలిస్ట్ హత్యకేసులో లాలూ కుమారుడికి నోటీసులు.. ద‌ర్యాప్తు చేసి నివేదిక అందించాలని సీబీఐకి ఆదేశం

ఇటీవ‌లే బీహార్‌లో జర్నలిస్టు రాజ్‌దేవ్‌ రంజన్‌ హత్యకు గురైన విష‌యం తెలిసిందే. ఈ కేసులో రాష్ట్ర పోలీసుల తీరుపై అభ్యంత‌రం తెలుపుతూ విచార‌ణ‌ను, ఢిల్లీ పరిధిలోకి బ‌దిలీచేయాల‌ని రంజ‌న్ భార్య సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. కేసులో ఈరోజు విచార‌ణ జ‌రిపిన సుప్రీంకోర్టు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు, బీహార్ మంత్రి తేజ్‌ ప్రతాప్‌తో పాటు ఇటీవల బెయిల్‌పై విడుదలైన ఆర్జేడీ మాజీ ఎంపీ షాబుద్దీన్‌కు నోటీసులు జారీ చేసింది. అంతేగాక ఈ కేసులో స‌మ‌గ్రంగా దర్యాప్తు చేపట్టాలని సీబీఐకి ఆదేశించింది. వ‌చ్చేనెల‌ 17లోగా ద‌ర్యాప్తు నివేదికను త‌మ ముందుంచాల‌ని చెప్పింది. ఈ హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడు, మోస్ట్ వాంటెడ్ షూట‌ర్ అయిన మ‌హ్మ‌ద్ కైఫ్‌ ఇటీవల తేజ్ ప్ర‌తాప్‌తో ఫొటో దిగిన విష‌యం విదిత‌మే.

More Telugu News