: ఇకపై ముంబయి-గోవా ప్రయాణం ఆరు గంటలే!

రోడ్డుమార్గంలో ముంబయి-గోవా మధ్య ప్రయాణ సమయం తగ్గనుంది. ఇకపై ముంబయ్ నుంచి కేవలం 6 గంటల్లోనే గోవా చేరుకోవచ్చని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. గోవాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, తాము నిర్మించబోయే నాలుగు లేన్ల కాంక్రీటు రహదారి వల్ల ముంబయి నుంచి గోవా మధ్య ప్రయాణ సమయం 6 గంటలే పడుతుందన్నారు. రోజుకు 22 కిలోమీటర్ల మేరకు రహదారి నిర్మిస్తామని అన్నారు. ఉత్తర గోవాలో నిర్మించనున్న కొత్త విమానాశ్రయం కోసం కూడా 8 కిలోమీటర్ల రహదారిని నిర్మించనున్నట్లు చెప్పారు.

More Telugu News