: హై పవర్ రాకెట్ ఇంజన్ ను పరీక్షించి ఉద్రిక్తతను మరింతగా పెంచిన ఉత్తర కొరియా

అణ్వాయుధాల విషయంలో ఇప్పటికే దూకుడుగా వ్యవహరిస్తున్న ఉత్తరకొరియా మరోసారి ఉద్రిక్తతలను పెంచే పని చేసింది. సరికొత్త హై పవర్డ్ రాకెట్ ఇంజన్ ను పరీక్షించి విజయవంతమైనట్టు నేడు వెల్లడించింది. ప్యోంగ్ జాంగ్ (ఉత్తర కొరియా రాజధాని) ఆయుధాల విస్తరణ కార్యక్రమంలో ఇదో కీలక మైలురాయని తెలిపింది. సొహే శాటిలైట్ లాంచింగ్ సైట్ నుంచి తమ దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్, ఇతర అధికారులు, సైంటిస్టులు చూస్తున్న వేళ ఈ ప్రయోగం జరిగినట్టు కేసీఎన్ఏ న్యూస్ ఏజన్సీ వెల్లడించింది. తాజా ప్రయోగాలపై జపాన్, దక్షిణ కొరియాలు మండిపడ్డాయి. ఇప్పటికే తమ వద్ద అమెరికా వరకూ వెళ్లి టార్గెట్ ను కొట్టే రాకెట్లు ఉన్నాయని, వాటికి అణు బాంబులను మోసుకెళ్లే సత్తా ఉందని ఉత్తర కొరియా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక వచ్చే నెల 10న అధికార వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా వ్యవస్థాపక దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించే ఏర్పాట్లు చేసుకుంటున్న కొరియా, ఆ రోజున ఓ శాటిలైట్ ను ప్రయోగించనున్నట్టు తెలుస్తోంది.

More Telugu News