: భక్తులకు మల్లన్న మరింత దూరం... టికెట్ ధరలను భారీగా పెంచేసిన శ్రీశైలం దేవస్థానం

కొలిచే భక్తుల కొంగు బంగారం శ్రీశైల మల్లికార్జున స్వామి దేవాలయంలో సేవా టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడున్న రూ. 50 ప్రత్యేక దర్శన టికెట్ ను రూ. 100కు పెంచారు. శ్రీ భమరాంబికాదేవి అంతరాలయంలో కుంకుమార్చనను రూ. 500 నుంచి రూ. 1000కి పెంచారు. అభిషేక అనంతర దర్శన టికెట్ ను రూ. 300 నుంచి రూ. 500కు పెంచారు. కొత్తగా రూ. 5 వేల రూపాయల టికెట్ ను ప్రవేశపెట్టారు. ఈ టికెట్ కొనుగోలు చేస్తే, మల్లికార్జున స్వామి గర్భాలయంలో అరగంట పాటు అభిషేకం చేసే అవకాశం లభిస్తుంది. శని, ఆది, సోమ వారాల్లో సుప్రభాత సేవల టికెట్ ధర రూ. 500గా నిర్ణయించారు. వీటన్నింటితో పాటు ఉచిత దర్శనం కూడా ఉంటుందని అధికారులు వెల్లడించారు. రుద్రాభిషేకం టికెట్ ధర రూ. 1500గా ఉంటుందని, లక్ష బిల్వార్చన టికెట్ ధర రూ. 3,116 నుంచి రూ. 5 వేలకు పెంచుతున్నామని తెలిపారు. రుద్రహోమం, చండీ హోమం టికెట్ ధరలను రూ. 1,200 నుంచి రూ. 1,500కు పెంచామని, మహామంగళహారతి, కల్యాణోత్సవం టికెట్లను రూ. 1,000 నుంచి రూ. 500కు తగ్గిస్తున్నామని పేర్కొన్నారు.

More Telugu News