: పాలస్తీనా నేత 'ఫతీ హమ్మద్ గ్లోబల్ టెర్రరిస్టు'... అమెరికా ప్రకటనతో గర్వంగా ఉందన్న ఫతీ

తనను ప్రపంచ ఉగ్రవాదిగా అమెరికా ముద్రవేయడంపై పాలస్తీనా నేత ఫతీ హమ్మద్ స్పందించారు. అమెరికా ప్రకటన తనకెంతో గర్వకారణమని అన్నారు. అమెరికా నిర్ణయం తరువాత, తాను వెళుతున్న మార్గం మంచిదేనన్న నమ్మకాన్ని మరింతగా పెంచిందని అన్నారు. తనను అరెస్ట్ చేసినా, హత్య చేసినా భయపడబోనని, తాను ఎంచుకున్న మార్గంలో ముందడుగే వేస్తానని తెలిపారు. కాగా, గాజా స్ట్రిప్ లో అంతర్గత వ్యవహారాల శాఖను హమ్మద్ పర్యవేక్షించారు. ఉగ్రవాదులను ఆయన పెంచిపోషించారన్న ఆరోపణలు ఉన్నప్పటికీ, వాటికి సంబంధించిన సాక్ష్యాలు మాత్రం లభ్యం కాలేదు. గతంలోనే హమ్మద్ పై ఉగ్రవాద ముద్ర వేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, అందుకు సంబంధించిన ఆదేశాలు తాజాగా వెలువడ్డాయి.

More Telugu News