: తప్పని ముప్పు... తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం!

గడచిన వారం రోజులుగా తెలుగు రాష్ట్రాలను వణికించిన వరుణుడు రెండు రోజులుగా శాంతించినప్పటికీ, ముప్పింకా తప్పలేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, అల్పపీడనంగా మారుతోందని, దీని ప్రభావంతో వచ్చే రెండు మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. కోస్తాంధ్రతో పాటు తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లోని పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ఇప్పటికే చెరువులు, కుంటలు అన్నీ నిండిపోవడంతో, వరదలు సంభవిస్తే, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

More Telugu News