: ఇరురాష్ట్రాలు ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి: కావేరి జలాల వివాదంపై సుప్రీంకోర్టు

కావేరి జ‌లాల అంశంపై సుప్రీంకోర్టులో ఈరోజు మ‌రోసారి విచార‌ణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా క‌ర్ణాట‌క, త‌మిళ‌నాడు మ‌ధ్య ఏర్ప‌డిన ఉద్రిక్త ప‌రిస్థితుల‌పై స్పందించింది. ప్ర‌జాందోళ‌న‌లు, ఆస్తి న‌ష్టాలు జ‌ర‌గ‌కుండా చూడాల్సిన బాధ్య‌త రాష్ట్రాల‌దేన‌ని స్ప‌ష్టం చేసింది. ప్ర‌జ‌లు చ‌ట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడ‌దని వ్యాఖ్యానించింది. ఇరురాష్ట్రాల ప్ర‌భుత్వాలు, సంబంధిత‌ అధికారులు ఆయా ప్రాంతాల్లో ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలని సూచించింది. కావేరి జ‌లాల అంశంలో త‌దుప‌రి విచార‌ణ‌ను ఈనెల 20కి వాయిదా వేస్తున్న‌ట్లు పేర్కొంది.

More Telugu News