: జీజీహెచ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంద్రాణిపై సస్పెన్షన్ వేటు

గుంటూరు జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) పిల్లల విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంద్రాణిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు వైద్యశాఖ ఒక ప్రకటన చేసింది. ప్రాణంతో వున్న బిడ్డ చనిపోయాడంటూ పిల్లల విభాగం వైద్యులు చెప్పడంతో శిశువు తల్లిదండ్రులు ఆందోళనకు దిగిన సంఘటనే ఆమె సస్పెన్ష్ కు కారణమైనట్లు తెలుస్తోంది. గుంటూరు శివారు దాసరిపాలెంకు చెందిన దుర్గాభవాని జీజీహెచ్ లో నిన్న మగశిశువుకు జన్మనిచ్చింది. ఆ బిడ్డను పరీక్షించిన వైద్యులు చనిపోయాడని చెప్పారు. అయితే, ఒక గంట సేపటి తర్వాత ఆ శిశువులో కదలికలను గమనించిన తల్లిదండ్రులు వెంటనే వైద్యులను సంప్రదించారు. అయినప్పటికీ, వారు స్పందించకపోవడంతో దుర్గాభవానీ బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో, వైద్యులు ఆ శిశువును ఐసీయూకి తరలించి చికిత్స అందించారు. దీనిపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఈ రోజు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంద్రాణిపై సస్పెన్షన్ వేటు వేశారు.

More Telugu News