: ఒక్క రోజులో రూ. 9375 కోట్లు నష్టపోయిన లెజండరీ ఇన్వెస్టర్ వారన్ బఫెట్

వారెన్ బఫెట్... ప్రపంచ స్టాక్ మార్కెట్లో లెజండరీ ఇన్వెస్టర్. బఫెట్ నమ్మి పెట్టుబడి పెట్టిన కంపెనీకి చిన్న మదుపుదారులు క్యూ కడతారు. తాము దాచుకున్న చిన్న చిన్న పొదుపు మొత్తాలను ఇన్వెస్ట్ చేస్తారు. అటువంటి చరిత్ర ఉన్న వారెన్ బఫెట్ ఒక్క రోజులో 1.4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 9,375 కోట్లు) నష్టపోయాడు. అందుకు కారణం బఫెట్ పెట్టుబడులు పెట్టిన వేల్స్ ఫార్గో అండ్ కో సంస్థ తీవ్ర కుంభకోణంలో చిక్కుకుపోవడమే! సంస్థ ఉద్యోగులు క్లయింట్ల అనుమతులు లేకుండా 20 లక్షలకు పైగా ఖాతాలు తెరిచారన్న సంచలన నిర్ణయం బయటపడటంతో ఒక్కసారిగా వేల్స్ ఫార్గో ఈక్విటీ విలువ 3.3 శాతానికి పైగా పడిపోయింది. ఈ సంస్థలో అత్యధిక వాటాదారుగా ఉన్న బెర్క్ షైర్ హాత్ వే ఈక్విటీ 2 శాతం పడిపోయింది. దీంతో బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ సైతం దిగజారగా, ప్రపంచంలోనే నాలుగో అత్యధిక ధనవంతుడిగా ఉన్న బఫెట్ సంపద 65.8 బి. డాలర్లకు తగ్గింది.

More Telugu News