: మరోసారి యూఎస్ నోట ‘పాక్’ పల్లవి

బలూచిస్తాన్... ఇటీవలి కాలంలో ఇక్కడి ప్రజలు పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. చైనా తన కార్యకలాపాలకు ఈ ప్రాంతాన్ని వాడుకునేందుకు పాక్ అనుమతించడాన్ని, పాక్ భద్రతా బలగాల ఆంక్షలకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో స్వతంత్ర బలూచిస్తాన్ అనే డిమాండ్ కూడా ఊపందుకుంది. ఈ విషయంలో పాక్ కు అమెరికా బాసటగా నిలిచింది. పాకిస్తాన్ ఐక్యత, ప్రాదేశిక సమగ్రతను అమెరికా గౌరవిస్తుందని, బలూచిస్తాన్ కు స్వాంతంత్ర్యం అనే డిమాండ్ కు సహకారం మద్దతు పలకబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ సోమవారం ప్రకటన చేశారు. బలూచిస్తాన్ లో పాక్ భద్రతా బలగాలు మానవ హక్కుల ఉల్లంఘనలపై ఇంటా బయటా వస్తున్న విమర్శలను విలేకరులు కిర్బీకి గుర్తు చేశారు. అయినా గానీ ఆయన పాకిస్తాన్ సమగ్రతనే గౌరవిస్తామంటూ మొదటి వాక్యాన్నే తిరగేశారు. స్వాంతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ తన ప్రసంగంలో పాక్ ఆక్రమిత కశ్మీరు, గిల్గిత్, బలూచిస్తాన్ అంశాల గురించి ప్రస్తావించిన విషయం తెలిసిందే.

More Telugu News