: రేషన్ కిరోసిన్ ధరను రూ. 2 పెంచిన తెలంగాణ ప్రభుత్వం!

తెలంగాణలో ఆహార భద్రత పథకం కింద రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే కిరోసిన్ ధరను లీటరుకు రూ. 2 పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం అంతర్గత సర్క్యులర్ జారీ చేసినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ కోటా కోసం డీలర్లు చెల్లించే డిపాజిట్లలో ఈ మొత్తాన్ని అదనంగా చెల్లించాలని అధికారుల నుంచి ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం. ప్రస్తుతం రేషన్ షాపుల ద్వారా లీటరుకు రూ. 15పై కిరోసిన్ విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల నుంచి లీటరు ధర రూ. 17కు పెరగనుంది. కాగా, గ్యాస్ కనెక్షన్ ఉంటే ఒక్కో కార్డుపై లీటర్ కిరోసిన్, గ్యాస్ లేకుంటే రెండు లీటర్ల కిరోసిన్ ఇస్తున్న సంగతి తెలిసిందే. కిరోసిన్ ధర పెంపుపై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.

More Telugu News