: మన ఐఐటీలు అంతంతమాత్రమే... టాప్ 150లో ఒక్కటీ లేదు!

ప్రపంచ స్థాయి నాణ్యతతో పోలిస్తే, భారత్ లోని ఐఐటీల్లో విద్యా బోధన అంతంతమాత్రంగానే ఉందని మరోసారి వెల్లడైంది. గ్లోబల్ ఐఐటీ ర్యాంకింగ్స్ ను ప్రకటించిన వేళ, ఒక్క భారత సంస్థ కూడా టాప్ 150లో నిలవలేకపోవడం గమనార్హం. గత సంవత్సరం టాప్ 150లో ఉన్న బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఈ సంవత్సరం మరింతగా దిగజారింది. క్యూఎస్ వర్డ్ యూనివర్శిటీ ఈ ర్యాంకులను వెల్లడించగా, మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) టాప్ లో నిలిచింది. మద్రాస్ ఐఐటీ మాత్రం గత సంవత్సరంతో పోలిస్తే 5 ర్యాంకులు ఎగబాకింది. ఇక ఇండియాలోని టాప్ 10 వర్శిటీల్లో 9 మాత్రం టాప్ 700లో నిలిచాయి. ఇదే సమయంలో ప్రపంచంలోని టాప్ 100 రీసెర్చ్ ఇంపాక్ట్ ర్యాంకులను ప్రకటిస్తే, ఇండియా నుంచి నాలుగింటికి మాత్రమే స్థానం లభించింది. ఇండియాలో పీహెచ్డీ క్వాలిఫైడ్ రీసెర్చర్ల సంఖ్య బాగా తక్కువగా ఉందని క్యూఎస్ వరల్డ్ అభిప్రాయపడింది. ఈ కారణంతోనే భారత ఐఐటీల ర్యాంకులు పడిపోతున్నాయని పేర్కొంది.

More Telugu News