: ‘ఒక దేశం... ఒకే ఎన్నిక’!... మోదీ ప్రతిపాదనకు రాష్ట్రపతి ఓటు!

దేశంలో ఎప్పుడు చూసినా ఎక్కడో ఒక చోట ఎన్నికల తంతు జరుగుతూనే ఉంది. వెరసి అభివృద్దికి ఎక్కడికక్కడ ఆటంకాలు ఎదురవుతున్నాయి. పార్లమెంటుకు ఓసారి, ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు మరోసారి... ఇక ఎప్పటికప్పుడు ఉప ఎన్నికలు నిర్వహిస్తుండటంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. ఈ నేపథ్యంలో రెండున్నరేళ్ల క్రితం ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ ఓ సరికొత్త ప్రతిపాదన చేశారు. ‘ఒక దేశం... ఒకే ఎన్నిక’ పేరిట ఆయన చేసిన ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే... దేశంలో పార్లమెంటు, ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు ఏక కాలంలో ఎన్నికలు జరగనున్నాయి. ఫలితంగా ప్రజాధనం దుర్వినియోగానికి చెక్ పడటంతో పాటు ఐదేళ్ల పాటు అభివృద్ధికి ఆటంకాలు ఎదురుకాబోవు. ఈ ప్రతిపాదనకు ఇప్పటికే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సరేనన్నాయి. తాజాగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా ఈ ప్రతిపాదనకు ఓటేశారు. దీంతో మోదీ ఆలోచన త్వరలోనే కార్యరూపం దాల్చనుందన్న వాదన వినిపిస్తోంది.

More Telugu News