ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

విజయవాడలో పవన్ కల్యాణ్, బొండా ఉమ చిత్రాలతో ప్లెక్సీలు... టీడీపీలో చర్చ!

Fri, Sep 02, 2016, 12:19 PM
Related Image పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా తెలుగుదేశం ఎమ్మెల్యే బొండా ఉమ అభినందనలు తెలుపుతున్నట్టు విజయవాడలో వెలసిన ప్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. బొండా ఉమ, పవన్ చిత్రాలు ఈ ప్లెక్సీలపై ఉండటంతో ఇది తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశమైంది. టీడీపీ గుర్తుగానీ, చంద్రబాబు ఫోటోలుగానీ లేకుండా ఉన్న ఈ ప్లెక్సీలపై పార్టీ కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించేందుకు నేతలు ప్రయత్నించడం లేదని తిరుపతి సభలో పవన్ తీవ్ర విమర్శలు కురిపించడం, ఆపై టీజీ వెంకటేశ్, బొండాల మధ్య నడిచిన విమర్శనాస్త్రాల నేపథ్యంలో ఈ ప్లెక్సీలు కనిపించడం గమనార్హం.
X

Feedback Form

Your IP address: 54.167.142.229
Articles (Latest)
Articles (Education)