: తలమార్పిడి సర్జరీకి నేనే మొదటి పేషెంట్ ను కావాలి: ‘హాఫ్ మాన్’ వ్యాధి బాధితుడు

ఇతర శరీర అవయవాల మాదిరిగానే తలను కూడా మారుస్తామని, ఆ అద్భుతాన్ని త్వరలోనే ఆవిష్కరిస్తామని న్యూరో సైంటిస్ట్ డాక్టరు సెర్గియో కెనవెరో, చైనీస్ సర్జన్ డాక్టరు జియోపింగ్ రెన్ ఇటీవల ప్రకటించారు. ఇందుకు, రష్యా దేశానికి చెందిన వ్యక్తి స్పిరిడొనోవ్ వెర్డినిగ్ ముందుకొచ్చాడు. హాఫ్ మాన్ వ్యాధితో బాధపడుతున్న అతను తన తల మార్చుకోవాలనుకుంటున్నట్లు చెప్పాడు. వైద్యులు కెనవెరో, జియోపింగ్ లు చేయనున్న తల మార్పిడి సర్జరీకి తానే మొదటి పేషెంట్ కావాలని స్పిరిడొనోవ్ భావిస్తున్నాడు. హాఫ్ మాన్ వ్యాధితో బాధపడుతున్నవారికి నరాలు పనిచేయవు. వెన్నెముక కూడా చచ్చుబడిపోతుంది. ఈ వ్యాధి సోకిన శరీర భాగాలను మార్చడం వీలుకాదు. దీంతో, తన తలను మార్చమని వీల్ చైర్ కే పరిమితమైన స్పిరిడొనోవ్ అంటున్నాడు. ఇక, తలమార్పిడి సర్జరీ చేయాలంటే, ముందుగా ఒక డోనార్ కావాలి. బ్రెయిన్ డెడ్ అయిన మరో వ్యక్తి శరీరానికి స్పిరిడొనోవ్ తలను అతికించాల్సి ఉంటుంది. ఇందుకుగాను, రెండు కుటుంబాల అంగీకారం తప్పనిసరి. ప్రత్యేక పరిస్థితుల్లో నిర్వహించే ఈ సర్జరీకి సుమారు 80 మంది వైద్యుల అవసరం ఉంటుంది. ఖర్చు విషయానికొస్తే మిలియన్ డాలర్లు. ఈ సర్జరీకి అనుమతి లభిస్తే కనుక చైనా లేదా మరో దేశంలో దీనిని నిర్వహిస్తారు. ఎందుకంటే, అమెరికా, యూరోప్ దేశాల్లో తల మార్పిడి సర్జరీకి ప్రస్తుతం అనుమతి లేదు. ఈ సర్జరీకి 90 శాతం సక్సెస్ రేట్ ఉంటుందని వైద్యులంటున్నారు.

More Telugu News