: తొలి టీ20లో విండీస్ 245 బారీ స్కోరు...లెవిస్ సెంచరీ

అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగుతున్న తొలి టీ 20 మ్యాచ్ లో వెస్టిండీస్ ఆటగాళ్లు దూకుడు ప్రదర్శించారు. టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ ఓపెనర్లు అమెరికన్లకు క్రికెట్ మజాను రుచిచూపారు. విండీస్ ఓపెనర్లు జాన్సన్ చార్లెస్, ఎవిన్ లెవిస్ ఫోర్లు, సిక్సర్లతో టీమిండియా బౌలర్లపై మెరుపు దాడులు చేశారు. టీ20 వరల్డ్ కప్ గెలుచుకుని మంచి జోరుమీదున్న విండీస్ ఓపెనర్లలో లెవిస్ చెలరేగిపోయాడు. స్టువర్ట్ బిన్నీ వేసిన 11వ ఓవరల్ లో శివాలెత్తాడు. ఐదు బంతులను సిక్సర్లుగా మలిచిన లెవిస్ 48 బంతుల్లో సెంచరీ చేసి, అశ్విన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. మరో ఎండ్ లో చార్లెస్ దూకుడు ప్రదర్శించడంతో కేవలం 33 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 79 పరుగులు చేశాడు. తొలి ఓవర్లలో విండీస్ బ్యాట్స్ మన్ తో చితక్కొట్టించుకున్న టీమిండియా బౌలర్లు చివర్లో తేరుకున్నారు. దీంతో చివరి ఐదు ఓవర్లలో యార్కర్లతో విరుచుకుపడి తక్కువ పరుగులిచ్చారు. చివరి ఓవర్ లో బుమ్రా అద్భుతం చేశాడు. తొలి బంతిని యార్కర్ గా సంధించి బ్రాత్ వైట్ ను రనౌట్ గా పెవిలియన్ పంపిన బుమ్రా, తరువాతి బంతికి సిక్సర్ ఇచ్చాడు. తరువాతి బంతిని తెలివిగా సంధించి సింగిల్ ఇచ్చాడు. ఆ తరువాతి బంతి కూడా సింగిలే. ఆ తరువాతి బంతిని తెలివిగా సంధించి మిడ్ వికెట్ ఎగురగొట్టాడు. దీంతో పొలార్డ్ పెవిలియన్ చేరాడు. ఆ తరువాతి బంతిని మరో యార్కర్ గా వేసి లెండిల్ సిమ్మన్స్ ను అవుట్ చేశాడు. హ్యాట్రిక్ అంచున నిలబడ్డ బుమ్రా చివరి బంతికి వికెట్ తీయలేకపోయాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్ జట్టు 245 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించింది. టీమిండియా బౌలర్లలో బుమ్రా రెండు, జడేజా రెండు, షమి ఒక వికెట్ తీశారు. 246 పరుగుల విజయ లక్ష్యంతో టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది.

More Telugu News