: 'లైఫ్' ఫోన్ కొనకుండానే రిలయన్స్ జియో సిమ్ కావాలా? ఇలా చేయండి!

రిలయన్స్ విక్రయిస్తున్న 'లైఫ్' సిరీస్ స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేస్తే వాటితో పాటే రిలయన్స్ జియో 4జీ సిమ్ లభించి మూడు నెలల పాటు ఉచితంగా అపరిమిత డేటా, కాల్స్ చేసుకోవచ్చన్న సంగతి తెలిసిందే. ఇక ఉచిత జియో సిమ్ ను అందరికీ ఉచితంగా ఇస్తామని రిలయన్స్ ప్రకటించింది. ఈ సిమ్ కోసం వేలాదిగా యువత రిలయన్స్ స్టోర్ల వద్ద పడిగాపులు పడుతున్నప్పటికీ, వారు సిమ్ ను పొందడంలో విఫలమవుతున్నారు. జియో సిమ్ పొందాలంటే ముందుగా చేయాల్సిన పని కొంత ఉంది. తొలుత మీ 4జీ స్మార్ట్ ఫోన్ (అది కూడా రిలయన్స్ ఆమోదించిన మోడలై ఉండాలి)లో ప్లే స్టోర్ కు వెళ్లి 'మై జియో' యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేయాలి. ఆపై 'గెట్ జియో సిమ్' అని బ్యానర్ కనిపిస్తుంది. దాన్ని టచ్ చేసి, నియమ నిబంధనలను అంగీకరించాలి. ఆపై మీ లొకేషన్ ను ఎంచుకుని 'నెక్ట్స్' నొక్కాలి. అప్పుడు స్క్రీన్ పై ఓ కోడ్ వస్తుంది. దాన్ని విడిగా రాసుకుని దగ్గర్లోని రిలయన్స్ స్టోరుకు వెళ్లి, మీ పాస్ పోర్టు సైజ్ ఫోటో, ఆధార్, రేషన్ కార్డు కాపీలను అందిస్తే సిమ్ లభిస్తుంది.

More Telugu News