: 'సరోగసి' విషయంలో షారూఖ్, అమీర్ లకు చురకలంటించిన సుష్మాస్వరాజ్

సరోగసి బిల్లుపై మీడియాకు వివరించిన సందర్భంగా కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ సెలబ్రిటీలకు చురకలంటిచారు. షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్, మంచు లక్ష్మి, తుషార్ కపూర్ ల పేర్లను ఆమె ప్రస్తావించకుండా 'ఇద్దరేసి పిల్లలు ఉన్నప్పటికీ సెలబ్రిటీలు సరోగసీ ద్వారా మరో బిడ్డను కన్నారు. వాళ్ల భార్యలు పిల్లల్ని గర్భంలో మోసి డెలివరీ సందర్భంగా మహిళ అనుభవించే బాధను పొందలేరు కనుక... డెలివరీ భారాన్ని వేరే మహిళల మీద మోపారు' అంటూ దెప్పిపొడిచారు. కాగా, గర్భం దాల్చడం ద్వారా అందం చెడిపోతుందని కొందరు, వ్యసనాలకు బానిసలు కావడం వల్ల ఆరోగ్యవంతులైన పిల్లలు పుట్టే అవకాశం లేదని మరికొందరు సెలబ్రిటీలు సరోగసీని ఆశ్రయిస్తున్నారు. సరోగసీని ఆశ్రయించిన వారి జాబితాలో తెలుగు సినీ నటి మంచు లక్ష్మి, బాలీవుడ్ నటుడు ఇంకా వివాహం చేసుకోని తుషార్ కపూర్ లు కూడా ఉన్నారు. వీరు అద్దె గర్భం ద్వారా పిల్లల్ని కన్నారు. వీరు నిరుపేద మహిళల డబ్బు అవసరాన్ని ఆసరాగా చేసుకుని, అద్దెగర్భాల ద్వారా పిల్లల్ని కన్నారని ఆరోపణలు గతంలో వచ్చిన సంగతి తెలిసిందే. అద్దె గర్భాన్ని మోసినందుకు సన్నిహిత బంధువు అయిన మహిళకు వైద్యఖర్చులు మాత్రమే చెల్లించాలని, ఎక్కువ మొత్తంలో డబ్బు ఆశ చూపకూడదని ఈ బిల్లు స్పష్టం చేస్తున్నదని ఆమె తెలిపారు. నిబంధనలు అతిక్రమించే వారు శిక్షార్హులని బిల్లు తెలియజేస్తోంది.

More Telugu News