ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

దెయ్యం అటకాయించిందంటూ వీడియో పోస్ట్ చేసిన తమిళ నటుడు... వైరల్ అవుతున్న వీడియోను మీరూ చూడండి!

Mon, Aug 22, 2016, 10:59 AM
Related Image నిజమైన దెయ్యం ఎదురుపడితే... ఆ ప్రశ్నే ఒళ్లు జలదరించేలా చేస్తుంది. తమిళ నటుడు 'వెన్నిల కబాడి కుళు' మూవీ ఫేమ్ సూరి, రాత్రిపూట ప్రయాణిస్తున్న వేళ, అతని కారుకు ఓ నిజమైన దెయ్యం ఎదురుపడిందట. ఆయన ఆ దెయ్యాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. పళని నుంచి కోయంబత్తూరు వెళుతున్న వేళ, అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఎర్రగా నిప్పులు విరజిమ్ముతున్నట్టున్న ఓ ఆకృతి రోడ్డు మధ్య నిలబడినట్టు ఈ వీడియోలో కనిపిస్తోంది. సూరి ప్రయాణిస్తున్న కారు ఆ ఆకారానికి అతిదగ్గరగా వచ్చింది. ఆపై కారు హెడ్ లైట్లు ఆర్పివేయగా, ఆ ఆకారం కనిపించకుండా పోయింది. సూరి పోస్ట్ చేసిన వీడియోను మీరూ చూడవచ్చు.
X

Feedback Form

Your IP address: 54.161.128.52
Articles (Latest)
Articles (Education)