: కుంబ్లే-కోహ్లీ కాంబినేషన్ సూపర్ హిట్టైంది: గిల్ క్రిస్ట్

టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే, టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీల కాంబినేషన్ సూపర్ హిట్ అయిందని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ తెలిపాడు. ముంబైలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గిల్ క్రిస్ట్ మాట్లాడుతూ, వారిద్దరి కాంబినేషన్ లో ఆడిన తొలి సిరీస్ ను గెలిచుకోవడమే ఇందుకు నిదర్శనమన్నాడు. గౌరవనీయ క్రికెటర్ అయిన కుంబ్లే సారధ్యంలో కోహ్లీ సేన విండీస్ గడ్డపై వెస్టిండీస్ జట్టును ఓడించడం విశేషమని తెలిపాడు. అయితే, ధోనీ బాగా ఆడుతున్నప్పుడు, కెప్టెన్ గా మంచి ఫలితాలు సాధిస్తున్నప్పుడు, మూడు పార్మాట్లకు కోహ్లీని కెప్టెన్ గా నియిమించాల్సిన అవసరం ఏంటని అడిగాడు. ధోనీ విఫలమైతే అప్పుడు ఇతర ఫార్మాట్ల గురించి ఆలోచించవచ్చని తెలిపాడు. వెస్టిండీస్ లో టెస్టు సిరీస్ ను గెలుచుకోవడం ద్వారా టీమిండియా టెస్టులో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకోవడం, వారి జోడీ కుదిరిందని చెప్పడానికి నిదర్శనమని గిల్ క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు.

More Telugu News