: క్వీన్ ఆఫ్ రణతంబోర్ ఇక లేదు.. ప్రపంచంలోనే అతి వృద్ధ పులి మాచిల్ కన్నుమూత

క్వీన్ ఆఫ్ రణతంబోర్, లేడీ ఆఫ్ ద లేక్స్, క్రోకడైల్ కిల్లర్.. తదితర ముద్దు పేర్లతో పిలుచుకునే ప్రపంచంలోని అతి వృద్ధ పులి మాచిల్ కన్నుమూసింది. రాజస్థాన్‌లోని రణతంబోర్ జాతీయ పార్క్‌లో ఉన్న ఈ వృద్ధ రాజం గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. పరిస్థితి విషమించడంతో గురువారం కన్నుమూసింది. సాధారణంగా పులుల జీవిత కాలం 10-15 ఏళ్లే. కానీ మాచిల్‌ ఈ ఏడాది మే నాటికి 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. అయితే ఆ తర్వాత క్రమంగా దాని ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ముఖ్యంగా కోరలు(దంతాలు) కోల్పోయిన తర్వాత వేటాడడంలో కష్టాలు ఎదుర్కొంది. ఫలితంగా దాని ఆరోగ్యం మరింత దెబ్బతింది. మాచిల్ మరణించిన విషయాన్ని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ట్విట్టర్ ద్వారా తెలిపారు.

More Telugu News