: 17 నెలల నుంచీ గర్భాన్ని మోస్తోన్న మహిళ!

మామూలుగా నవమాసాలు నిండగానే గర్భిణికి డెలివరీ జరిగిపోతుంది. అయితే, చైనాలో మాత్రం 17 నెలల గర్భవతి ఉంది. చైనాలోని హునాన్‌ ప్రావిన్స్‌ కి చెందిన వాంగ్‌ షీ అనే మహిళ 2015 ఫిబ్రవరిలో గర్భం దాల్చింది. లెక్క ప్రకారం ఆమె గత నవంబర్‌ లో ఆమెకు డెలివరీ కావాలి. అందుకోసం తొమ్మిది నెలలు నిండగానే ఆసుపత్రికి వెళ్లింది. అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు కడుపులో బిడ్డ పూర్తిగా ఎదగలేదని, పిండం పూర్తిగా ఎదిగిన తరువాత డెలివరీ అవుతుందని, ఆందోళన చెందొద్దని చెప్పి పంపారు. అయితే, 17 నెలల నిండినా ఇంకా డెలివరీ కాకపోవడంతో ఇప్పుడామె ఆందోళన చెందుతోంది. వైద్య పరీక్షలకు ఇప్పటి వరకు 1,156 పౌండ్లు ఖర్చైందని, గర్భం దాల్చినప్పటి నుంచి ఇప్పటివరకు 25.2 కిలోల బరువు పెరిగానని ఆమె తెలిపింది. ఇంక ఈ గర్భం మోయడం తన వల్ల కాదని, సిజేరియన్ చేయండని అడిగినా వైద్యులు అంగీకరించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. వైద్యపరమైన కారణాల వల్లే కడుపులో బిడ్డ ఎదగడం లేదని, ఇలాంటి కేసులు ప్రతి 200 మందిలో ఒకరిలో కనిపిస్తుంటాయని వైద్యులు చెబుతున్నారు. ఇంతకీ బిడ్డ ఎదగడానికి ఎంతకాలం పడుతుందో మాత్రం వారు చెప్పకపోవడం విశేషం.

More Telugu News