: ధోనీ నుంచి పగ్గాలు తీసుకున్నప్పుడే కోహ్లీ అలా భావించాడు: రోహిత్ శర్మ

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నుంచి టెస్టు జట్టు పగ్గాలు స్వీకరించినప్పుడే టెస్టుల్లో టీమిండియాను వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకులో నిలబెట్టాలని కోహ్లీ భావించాడని రోహిత్ శర్మ తెలిపాడు. ఈ నెల 18 నుంచి వెస్టిండీస్ లోని ట్రినిడాడ్ లో నాలుగో టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ, ఐసీసీ వరల్డ్ ర్యాంకింగ్స్ లో టీమిండియాను నెంబర్ వన్ గా నిలపడమే లక్ష్యంగా బరిలో దిగుతామని అన్నాడు. నాలుగో టెస్టులో విజయం సాధించడం ద్వారా ఐసీసీ ర్యాంకింగ్స్ లో పాయింట్లు మెరుగుపరుచుకుని వరల్డ్ నెంబర్ వన్ టెస్టు జట్టుగా స్థానాన్ని సుస్థిరం చేసుకుంటామని ఆయన తెలిపాడు. నెంబర్ వన్ ర్యాంకు సాధించిన టీమిండియా ఆ స్థానంలో కొంత కాలం నిలబడాలంటే విండీస్ పై నాలుగో టెస్టులో కూడా విజయం సాధించాలి. లేని పక్షంలో వరల్డ్ నెంబర్ వన్ టెస్టు జట్టుగా పాకిస్థాన్ ఆవిర్భవించనుంది.

More Telugu News