ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఏడు నెలల చిన్నారిని కారులోనే వదిలివెళ్లిన తండ్రి.. ప్రాణాలు కోల్పోయిన చిన్నారి

Sat, Aug 13, 2016, 01:47 PM
తండ్రి నిర్లక్ష్యానికి అభంశుభం తెలియని చిన్నారి బలైన సంఘటన అమెరికాలోని టెక్సాస్ లో చోటుచేసుకుంది. అక్కడి శాన్ అంటోరియాలోని వాల్ మార్ట్ పార్కింగ్ ప్రాంతంలో ఓ ఏడు నెల‌ల చిన్నారిని తండ్రి కారులో నిర్ల‌క్ష్యంగా వ‌దిలేశాడు. దీంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. హెలోటెస్ సబర్బన్ లోని స్టోర్‌లో ప‌నిచేస్తోన్న తండ్రి తన కొడుకును డే కేర్ సెంటర్ లో వదిలిపెట్టడం మర్చిపోయి, కారులోనే వ‌దిలేసి త‌న ప‌ని చూసుకోవ‌డానికి వెళ్లిపోవడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడ‌ని అమెరికా మీడియా పేర్కొంది.

ఉదయం 6.15 గంటలకు కారును వ‌దిలి వెళ్లిన తండ్రి మ‌ధ్యాహ్నం 3 గంటలకు మ‌ళ్లీ త‌న కారు వ‌ద్ద‌కు వ‌చ్చాడు. కారులో స్పృహ లేకుండా పడివున్న కొడుకును చూసి ద‌గ్గ‌ర‌లోని ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌గా వైద్యులు ఆ చిన్నారి మృతి చెందాడ‌ని చెప్పారు. త‌ల్లిదండ్రుల నిర్లక్ష్యంతో అమెరికాలో కార్లలో ఈ ఏడాది ఇప్పటివరకు 27 మంది చిన్నారులు ఈ విధంగా ప్రాణాలు కోల్పోయారు.
X

Feedback Form

Your IP address: 54.146.177.118
Articles (Latest)
Articles (Education)