ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

యువతను ఆకట్టుకునేందుకు ఐఎస్ కొత్త వ్యూహాలు!

Thu, Aug 11, 2016, 03:47 PM
Related Image యువతకు ఎర వేసేందుకు ఉగ్రవాద సంస్థ ఐఎస్ కొత్త వ్యూహాలు పన్నుతోంది. ఈ వ్యూహాల్లో భాగంగా హాలీవుడ్ తరహా నటన, మ్యూజిక్ తో కూడిన వీడియోలతో యువతకు ఎర వేస్తోందని ఒక నివేదిక వెల్లడించింది. ఫ్రెంచ్ మాట్లాడే ఐఎస్ టెర్రరిస్టుల్లో సుమారు 80 శాతం మంది ఈ తరహా వీడియోలకు ఆకర్షితులైన వారేనని ఫ్రెంచ్ అధికారులు చెబుతున్నారు.

‘సూపర్ జిహాదీ’ పేరిట ఫ్రాన్స్ నుంచి విడుదలైన హాలీవుడ్ స్ట్రైల్ వీడియోలు వారిని బాగా ఆకర్షించాయని పేర్కొన్నారు. ప్రత్యేక ఎడిటింగ్, ర్యాప్ మ్యూజిక్ తో ఈ వీడియోలను రూపొందించారన్నారు. ఈఫిల్ టవర్ పై వచ్చిన ‘కాల్ ఆఫ్ డ్యూటీ’ అనే వీడియో గేమ్ నుంచి సేకరించిన గ్రాఫిక్స్ తో యువతను ఆకట్టుకునే విధంగా ఐఎస్ అనుకూల గ్రూప్ అల్-వాద్ మీడియా ప్రొడక్షన్ రూపొందించిన ఒక వీడియో ఏప్రిల్ నెలలో బయటకు వచ్చింది. ఈ వీడియోకు పలువురు యువత ఆకర్షితులయ్యారని సమాచారం.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Articles (Latest)
Articles (Education)