: కశ్మీర్‌కు స్వాతంత్ర్యం వచ్చే వరకు భారత్‌తో వాణిజ్య సంబంధాలు నిలిపివేయండి: పాక్ ప్రభుత్వాన్ని కోరిన హఫీజ్ సయీద్

భారత్ నుంచి కశ్మీర్‌కు స్వాతంత్ర్యం లభించే వరకు ఆ దేశంతో వాణిజ్యపరమైన సంబంధాలకు పుల్‌స్టాప్ పెట్టాలని జమాత్ ఉద్ దవా (జేయూడీ) చీఫ్ హఫీజ్ సయీద్ పాక్ ప్రభుత్వాన్ని, వ్యాపారులను కోరాడు. అలాగే సార్క్ సమావేశాల కోసం పాక్ వస్తున్న భారత హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను దేశంలోకి అనుమతించవద్దని నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని అభ్యర్థించాడు. కశ్మీర్‌ను సందర్శించేందుకు, కశ్మీరీలకు సాయం చేసేందుకు పాక్ ప్రభుత్వానికి అనుమతి ఇస్తామంటేనే ఆయనను దేశంలోకి అనుమతించాలని షరఫ్‌కు సూచించాడు. మరోవైపు కశ్మీర్ అంశంపై జమాత్-ఇ-ఇస్లామీ ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసింది. కాగా సార్క్ అంతర్గత, హోంమంత్రుల కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు 3వ తేదీన రాజ్‌నాథ్ సింగ్ పాక్ వెళ్లనున్న సంగతి తెలిసిందే.

More Telugu News