: 'కాశ్మీర్' ఇక్కడా, అక్కడా రావణ కాష్టమే!

భారత సరిహద్దు రాష్ట్రమైన కాశ్మీర్ ఇవతల, అవతల కూడా రావణ కాష్టంగా మారింది. భారత్ లోని కాశ్మీర్ లో తీవ్రవాది బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ కలకలం రేపి, ఉద్రిక్తతలకు కారణమైతే... పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ 'ఆజాద్ జమ్మూకాశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ' ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ కు చెందిన పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) ఎన్నికవడం ఉద్రిక్తతకు దారితీసింది. ఆ పార్టీ 32 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ఈ నెల 21న వెల్లడైన ఫలితాల పట్ల అక్కడి విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగలేదని, జాబితాలో పేరున్న పౌరులకు ఓట్లు వేసే అవకాశం దక్కలేదని, దేశ గూఢచార సంస్థ ఐఎస్ఐని రంగంలోకి దింపి ప్రధాని నవాజ్ షరీఫ్ రిగ్గింగ్ కు పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ముజఫరాబాద్ సహా కోట్లి, చినారి, మిర్పూర్ లలతో అల్ జమ్మూకాశ్మీర్ ముస్లిం లీగ్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ ఆందోళనల్లో టైర్లను తగులబెట్టిన ఆందోళనకారులు భద్రతాదళాలపై దాడులకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తవాతావరణం నెలకొంది. దీనిపై భారత హోంశాఖ సహాయ మంత్రి మాట్లాడుతూ, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో హక్కుల ఉల్లంఘన జరుగుతుందన్న సంగతి ప్రపంచం మొత్తానికి తెలుసని పేర్కొన్నారు.

More Telugu News