: విశాఖ మెరైన్ టవర్ కు పొంచి ఉన్న ముప్పు!... కోతకు గురవుతున్న రిషికొండ తీరం!

సాగర నగరం విశాఖలో సముద్రం ఉగ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే సముద్రపు భీకర అలల తాకిడికి నగరంలోని సుందర ప్రదేశంగా పేరున్న ఆర్కే బీచ్ కోతకు గురైంది. ఈ నేపథ్యంలో తీరంలో కాస్తంత లోతు తక్కువగా ఉన్న రిషికొండ బీచ్ కు పర్యాటకుల తాకిడి పెరిగింది. లోతు తక్కువ, అలల తాడికి కూడా తక్కువగా ఉన్న రిషికొండ బీచ్ లో పర్యాటకులు సేద తీరుతున్నారు. అయితే గడచిన కొంతకాలంగా రిషికొండ బీచ్ లోనూ సముద్రపు అలల తాకిడి మరింతగా పెరుగుతోంది. ఫలితంగా రిషికొండలో తీరం కోతకు గురవుతోంది. ఇప్పటికే రిషికొండ తీరం వెంట ఉన్న పలు దుకాణాలు నేలకూలగా, రోడ్డు కూడా దాదాపుగా కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది. రిషికొండలో సముద్ర అలల తాకిడి ఇదే క్రమంలో కొనసాగితే... విశాఖ తీరంలోని మెరైన్ టవర్ కూడా కనుమరుగయ్యే ప్రమాదం లేకపోలేదన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలోనే రిషికొండలో అలల తాకిడి క్రమంగా పెరుగుతోందని వాతావరణ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

More Telugu News