: తొలి ప్రయాణంతో చేదు అనుభవాన్ని మూటగట్టుకున్న సీప్లేన్

చైనాలోని షాంగైలో విషాదం చోటుచేసుకుంది. చైనాలోని జోయ్ జనరల్ ఏవియేషన్ సంస్థ సరికొత్తగా సీ ప్లేన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. సముద్రంలోనే దిగి, సముద్రంపై నుంచి గాల్లోకి ఎగిరే సీ ప్లేన్ లో విహరించేందుకు ప్రయాణికులు సిద్ధమయయారు. ఈ క్రమంలో షాంగైలో ఈ విమానం ఉన్న బ్రిడ్జ్ ను ఢీ కొని సముద్రంలో కుప్పకూలింది. దీంతో నేవీ సిబ్బంది అప్రమత్తమై విమానంలోని వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అయితే వారు విమానం వద్దకు చేరుకునే సరికే విమానంలోని ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 8 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు ఉన్నారు. కాగా, జొయ్ జనరల్ ఏవియేషన్ చేపట్టిన తొలి ప్రయాణం విషాదాంతంగా మారడంతో ఆ సంస్థ షాక్ కు గురైంది. దీనిపై చైనా విమానయాన సంస్థ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News