: బ్రెగ్జిట్ ఎఫెక్ట్ భారత్ పై లేదు!... 7.4 వృద్ది సాధ్యమంటూ ఐఎంఎఫ్ అంచనా!

ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేసిన బ్రెగ్జిట్... భారత్ పై మాత్రం తన ప్రభావాన్ని చూపలేకపోయింది. భారత ఆర్థిక వ్యవస్థకున్న గట్టి మూలాలే ఇందుకు కారణమని ‘అంతర్జాతీయ ద్రవ్య నిధి' (ఐఎంఎఫ్) తేల్చిచెప్పింది. యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ బయటకు వచ్చేయాలన్న విషయంపై జరిగిన ఓటింగ్ ను బ్రెగ్జిట్ గా పిలుస్తున్న విషయం తెలిసిందే. బ్రిటన్ లో జరిగిన ఈ ఓటింగ్ లో ఆ దేశానికి చెందిన మెజారిటీ మంది ప్రజలు బ్రెగ్జిట్ కు అనుకూలంగా ఓటేయడంతో బ్రిటన్... ఈయూ నుంచి బయటకు వచ్చేయడం ఖాయమైపోయింది. ఈ క్రమంలో పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అయితే భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం ఏమాత్రం ప్రభావితం కాలేదని ఐఎంఎఫ్ తేల్చిచెప్పింది. నిరుడు (2015-16)లో 7.5 శాతం వృద్ధి రేటు సాధించిన భారత్... తాజాగా 2016-17 ఆర్థిక సంవత్సరంలో 7.4 శాతం వృద్ధితో దూసుకెళ్లడం ఖాయమని ఆ సంస్థ అంచనా వేసింది.

More Telugu News