: నవాజ్ షరీఫ్ జీ, మోదీని చూసి నేర్చుకోండి: రాఖీ సావంత్

పాకిస్థాన్ మోడల్ ఖండీల్ బలోచ్ హత్యపై బాలీవుడ్ ఐటెం గర్ల్ రాఖీ సావంత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ముంబైలో రాఖీ మాట్లాడుతూ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత ప్రధాని నరేంద్ర మోదీని చూసి చాలా నేర్చుకోవాలని చెప్పింది. బాలికలను కాపాడేందుకు మోదీ 'బేటీ బచావో బేటీ పడావో'ను ప్రవేశపెట్టారని, ఆడపిల్లలను రక్షించడం మోదీని చూసి నేర్చుకోవాలని ఆమె సూచించింది. ఖండీల్ బలోచ్‌ ను దారుణంగా హత్య చేసిన ఆమె సోదరుడు గఫూర్‌ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ప్రజాస్వామ్య దేశమైన పాకిస్థాన్‌ లో ఓ మోడల్ ను ఇంత దారుణంగా సోదరుడు హత్య చేయడం దారుణమని అభిప్రాయపడ్డ రాఖీ, పాక్ లో యువతులకు స్వేచ్ఛ లేకుండా పోయిందని, ఆమెను హత్య చేసే హక్కు ఆమె సోదరుడికి ఎవరిచ్చారని నిలదీసింది. ఖండీల్ బలోచ్‌ ను హత్య చేయడానికి ముందు ఆమె సోదరుడు ఆమెపై అత్యాచారం కూడా చేశాడని ఆమె తీవ్రస్థాయిలో ఆరోపించింది.

More Telugu News