ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

లేటెస్ట్ ట్రెండ్... పులులే డిజైనర్లు...టైగర్స్ తయారు చేసే జూ జీన్స్!

Sat, Jul 09, 2016, 04:19 PM
Related Image ఈవేళ ఫ్యాషన్ కొత్త పుంతలు తొక్కుతోంది. విదేశాల్లోని వారు వేసుకునే జీన్స్ ప్యాంట్ కి ఎన్ని చిరుగులు వుంటే అంత ఫ్యాషన్... ఈ ట్రెండ్ కి తగ్గట్టు అక్కడ 'జూ జీన్స్' అనే సంస్థ సరికొత్త డిజైనర్లతో జీన్స్ తయారు చేయిస్తోంది. ఇక్కడ అసలు విశేషం ఏమిటంటే, ఆ డిజైనర్లు పులులు కావడం! జపాన్ లోని హిటాచీలో 'కామినే' పేరిట ఓ జూ వుంది. అక్కడ వీటిని తయారుచేస్తున్నారు. సంస్థ ముందుగా తయారు చేసిన జీన్స్ ను ఫుట్ బాల్, టైర్ వంటి వాటికి చుట్టి పులులు తిరిగే బోనుల్లో వదిలేస్తారు. తర్వాత వాటిని పట్టుకుని పులులు అక్కడక్కడ పంటిగాట్లు, గోరు గాట్లతో ఈ జీన్స్ కు చిల్లులు పెడతాయి. వాటిని తీసుకుని మరమ్మతులు చేసి, ఆ పులులు చేసిన గాట్లు, గీకుళ్లు తొడభాగంలో వచ్చేలా కుడతారు. వీటిని 'జూ జీన్స్' బ్రాండ్ గా షాపింగ్ మాల్స్ లో విక్రయిస్తున్నారు. వీటికి జపాన్ లో మంచి ఆదరణ ఉందని ఈ బ్రాండ్ యజమానులు తెలిపారు.
X

Feedback Form

Your IP address: 50.16.17.16
Articles (Latest)
Articles (Education)
Top Stories (English)

Warning: mysql_fetch_array() expects parameter 1 to be resource, boolean given in /home/srirama/public_html/ap7am-nf/english-news-nf/ap7am-enews-top-stories-sidewidget-10l.php on line 8