: ఎఫ్ బీఐ కార్యాలయంలో హిల్లరీ... 3.5 గంటల పాటు ప్రశ్నలకు సమాధానాలిచ్చిన వైనం

అమెరికా అధ్యక్ష పదవికి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఖరారైన హిల్లరీ క్లింటన్ ఆ దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్ బీఏ) విచారణకు హాజరయ్యారు. ఆ దేశ మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సతీమణిగానే కాకుండా గతంలో ఆ దేశ విదేశాంగ మంత్రిగానూ ఆమె పనిచేసిన విషయం తెలిసిందే. విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆమె వ్యక్తిగత ఈ-మెయిల్స్ వాడినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై ఎఫ్ బీఐ అధికారులు ఆమెను విచారించాలని నిర్ణయించారు. దీంతో నిన్న హిల్లరీనే స్వయంగా ఎఫ్ బీఐ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ దర్యాప్తు సంస్థ అధికారులు మూడున్నర గంటల పాటు సంధించిన ప్రశ్నలకు ఆమె ఓపిగ్గా సమాధానాలు చెప్పారు. ఈ మేరకు ప్రతినిధి నిక్కీ మెరిల్లీ నిన్న ఓ ప్రకటన విడుదల చేశారు. చట్టానికి లోబడి దర్యాప్తు అధికారులకు పూర్తిగా సహకరించేందుకు హిల్లరీ సిద్ధంగా ఉన్నారని మెరిల్లీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

More Telugu News