: చరిత్ర సృష్టించిన హెచ్ఏఎల్... సుఖోయ్ యుద్ధ విమానాలకు బ్రహ్మోస్ క్షిపణులు

సుఖోయ్ యుద్ధ విమానాలకు సూపర్ సానిక్ క్షిపణి బ్రహ్మోస్ ను అమర్చడం ద్వారా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) చరిత్ర సృష్టించింది. నాసిక్ విమానాశ్రయంలో సుఖోయ్ ఎస్యూ-30 ఎంకేఐ విమానానికి 2,500 కిలోల బరువున్న బ్రహ్మోస్ క్షిపణిని అమర్చి నిర్వహించిన టెస్ట్ రైడ్ విజయవంతం కావడంతో అధికారులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. 45 నిమిషాల పాటు యుద్ధ విమానం నింగిలో ఎగిరిందని, మేకిన్ ఇండియాలో భాగంగా భారత విమానయాన రంగం మరింతగా దూసుకు వెళ్లనుందని చెప్పేందుకు ఇదో ఉదాహరణని హెచ్ఏఎల్ చైర్మన్ టీ సువర్ణ రాజు వ్యాఖ్యానించారు. ఇకపై యుద్ధ విమానాల నుంచి బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించవచ్చని ఆయన అన్నారు.

More Telugu News