: ఎట్టకేలకు ఉత్తర కొరియా సక్సెస్!... ముసుదాన్ క్షిపణి ప్రయోగం విజయవంతం!

ప్రపంచ దేశాలన్నీ వద్దు వద్దంటున్నా వినని ఉత్తర కొరియా తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. సొంత టెక్నాలజీతో నిర్మించిన ముసుదాన్ క్షిపణి ప్రయోగాన్ని ఆ దేశం నేటి ఉదయం దిగ్విజయంగా ముగించింది. నేటి ఉదయం సరిగ్గా 6 గంటలకు ప్రయోగించిన తొలి ముసుదాన్ క్షిపణి ప్రయోగం విఫలమైంది. అయితే రెండు గంటల తర్వాత (నేటి ఉదయం 8 గంటలకు) ప్రయోగించిన ముసుదాన్ నిర్దేశిత లక్ష్యాన్ని విజయవంతంగా చేధించింది. దీంతో ఉత్తర కొరియా విజయ గర్వంతో ఉప్పొంగిపోయింది. ముసుదాన్ పేరిట ఉత్తర కొరియా రూపొందించిన మధ్యంతర క్షిపణిని విజయవంతంగా ప్రయోగించేందుకు ఆ దేశం ఈ ఏడాదిలోనే నాలుగు సార్లు యత్నించి విఫలమైంది. ఈ ప్రయోగాలపై ప్రచంచ దేశాలన్నీ ఆగ్రహం వ్యక్తం చేసినా, ఆ దేశం పట్టించుకోలేదు. పట్టు వదలని విక్రమార్కుడిలా ఆ దేశం ముసుదాన్ ను నేటి ఉదయం విజయవంతంగా ప్రయోగించింది. ప్రయోగం విజయవంతమైన వెంటనే పొరుగు దేశం దక్షిణ కొరియాతో పాటు అగ్రరాజ్యం అమెరికా కూడా ఘాటుగా స్పందించింది. ఉత్తర కొరియా ప్రయోగాన్ని ఆ దేశాలు తీవ్రంగా ఖండించాయి.

More Telugu News