: ఇంత మోసమా?... రూ. 30 కోక్ ను రూ. 100కు అమ్ముతున్న మెక్ డొనాల్డ్స్, హల్దీరామ్స్!

సాధారణ రిటైల్ స్టోర్లలో రూ. 30కి లభించే కోక్ క్యాన్స్... మిడ్ టైర్ మాస్ రెస్టారెంట్లుగా పేరున్న మెక్ డొనాల్డ్స్, హల్దీరామ్స్ వంటి వాటిల్లో రూ. 100కు విక్రయిస్తున్నారు. ఇంతటి మోసానికి కోకకోలా సంస్థ కూడా తన వంతు సహకారాన్ని అందిస్తోంది. ఈ వేసవిలో ప్రజల దాహార్తి, శీతల పానీయాలపై ఉండే మక్కువను లాభాల రూపంలోకి మార్చుకోవడమే లక్ష్యంగా ఈ స్టోర్లు ఇలా బాదుతున్నాయి. రెండు వారాల క్రితం వరకూ న్యూఢిల్లీలో రూ. 30 ఖరీదుండే క్యాన్ ను రూ. 60 వరకూ విక్రయించిన రెస్టారెంట్లు, ఇప్పుడు వాటిని రూ. 100కు అంటగడుతున్నాయి. ఇక వాటిపై గరిష్ఠ చిల్లర ధరను రూ. 100గా ముద్రిస్తూ, కోకకోలా సంస్థ వీరికి సహకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించగా, అందుకు చట్టాలు అనుమతిస్తున్నాయని, ఒకే క్వాలిటీ, క్వాంటిటీ ఉన్న ఉత్పత్తులకు పరస్పర ఎంఆర్పీని ప్రకటించుకునే సౌలభ్యం తమకుందని కోకకోలా ప్రతినిధి స్పందించడం గమనార్హం.

More Telugu News