: యాహూలో ట్విట్టర్ విలీనం కానుందా?

మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్, ఇంటర్నెట్ ఆధారిత సేవల సంస్థ యాహూలో విలీనం కానుందా? అంటే మార్కెట్ వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. ఈ రెండు సంస్థల సీఈవోలు సమావేశమై దీనిపై గంటలపాటు చర్చలు జరిపారని సమాచారం. అయితే విలీనంపై రెండు సంస్థలు మౌనం వహించడం విశేషం. చట్టప్రకారం విలీనం పూర్తయ్యాక దీనిపై ప్రకటన చేస్తే మంచిదని రెండు సంస్థలు భావిస్తున్నాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. వెబ్ ఆధారిత సేవలు అందించడంలో ముందున్న యాహూనుంచి సేవలందుకునేందుకు ట్విట్టర్ ఆసక్తి చూపుతోందని సమాచారం. ఈ రెండు సంస్థల మధ్య బిడ్డింగ్ ప్రాసెస్ త్వరలోనే పూర్తవుతుందని మార్కెట్ వర్గాల భోగట్టా. కాగా, ఫేస్ బుక్ దూసుకెళ్తుండడంతో వ్యాపార విస్తరణలో భాగంగా ట్విట్టర్, యాహూలో విలీనం కావడం రెండు సంస్థలకు లాభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

More Telugu News