ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

‘అ..ఆ’లో అల్లరి పిల్లని... నిజ జీవితంలోనూ అంతే!: హీరోయిన్ సమంత

Tue, May 31, 2016, 07:45 PM
‘అ..ఆ’ సినిమా గొప్ప కథేమీ కాదని, కాకపోతే, ఎమోషన్స్ ని దర్శకుడు త్రివిక్రమ్ చాలా చక్కగా చూపించారని దక్షిణాది అందాల భామ సమంత చెప్పింది. ఈ చిత్రం ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, నిజజీవితంలో తాను అల్లరి పిల్లనేనని, ఈ చిత్రంలో తాను నటించిన పాత్ర కూడా అదేనని చెప్పింది.

హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న సినిమా ఇది అని అనుకుంటారు, కానీ, అదేమీ కాదని చెప్పింది. ఏ సినిమా అయినా క్యారెక్టర్ నచ్చితేనే చేస్తానని, త్రివిక్రమ్ దర్శకుడు కదా అని చెప్పి ఈ చిత్రంలో తానేమీ నటించలేదని తన మనసులో మాట చెప్పింది. నితిన్ తనకు మంచి స్నేహితుడని చెప్పిన సమంతా, ఆ యువహీరోతో రొమాంటిక్ సన్నివేశాలు చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండేదని, తనకు పెళ్లయిన తర్వాత కూడా చిత్రాల్లో నటిస్తానని సమంత స్పష్టం చేసింది.
X

Feedback Form

Your IP address: 54.161.175.236
Articles (Latest)
Articles (Education)
Top Stories (English)

Warning: mysql_fetch_array() expects parameter 1 to be resource, boolean given in /home/srirama/public_html/ap7am-nf/english-news-nf/ap7am-enews-top-stories-sidewidget-10l.php on line 8