: ప్రభుత్వ వైద్యుల పదవీ విరమణ వయస్సు పెంచుదామనుకుంటున్నాం: ప్రధాని మోదీ

గవర్నమెంట్ వైద్యుల రిటైర్మెంట్ వయస్సును 65 సంవత్సరాలకు పెంచే ఉద్దేశంలో ఉన్నామని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. దేశంలో వైద్యుల కొరత నేపథ్యంలోనే తాము ఈ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే, ఈ నిర్ణయంపై కేంద్ర కేబినెట్ ఈ వారంలో ఆమోదం తెలపనుందన్నారు. ప్రధాని మోదీ పాలన రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా షహరాన్ పూర్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఒక ర్యాలీలో ఆయన మాట్లాడారు. దేశ వ్యాప్తంగా మరింత మంది వైద్యుల అవసరం ఉందని అన్నారు. ఈ కొరతను కేవలం తన రెండేళ్ల పాలనలో భర్తీ చేయడం కష్టమని, అందుకే, ప్రభుత్వ వైద్యుల పదవీ విరమణ వయస్సు పెంచాలన్న ఈ నిర్ణయానికి వచ్చామన్నారు. రాష్ట్రంలో లేదా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న వైద్యులందరికీ ఈ నిర్ణయం వర్తిస్తుందని మోదీ చెప్పారు.

More Telugu News