: 2023లో భారత్ లో పరుగులు తీయనున్న బుల్లెట్ ట్రెయిన్

మన దేశంలో మొట్ట మొదటి బుల్లెట్ ట్రెయిన్ 2023వ సంత్సరం నాటికి పరుగులు పెడుతుందని రైల్వే మంత్రి సురేష్ ప్రభు పేర్కొన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముంబయి- అహ్మదాబాద్ మధ్య తిరగనున్న బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్ట్ కు సంబంధించి ఇంతకుముందే చర్చలు జరిగాయన్నారు. ప్రణాళికల మేరకు పనులు జరుగుతున్నాయన్నారు. సముద్రం కింద ఏర్పాటు చేసే 21 టన్నెల్స్ ద్వారా ముంబయి నుంచి అహ్మదాబాద్ కు ఈ ట్రెయిన్ ప్రయాణిస్తుందని .. ప్రయాణికులకు మంచి అనుభూతి మిగులుతుందని సురేష్ ప్రభు అన్నారు. కాగా, ముంబయి- అహ్మదాబాద్ మధ్య సుమారు 508 కిలోమీటర్ల దూరాన్ని రెండు గంటల్లో చేరుకునే బుల్లెట్ ట్రెయిన్ గరిష్ట వేగం 350 కేఎంపీహెచ్ కాగా, ఆపరేటింగ్ స్పీడ్ 320 కేఎంపీహెచ్.

More Telugu News