: మాల్యా చెక్ బౌన్స్ కేసులో కొత్త ట్విస్ట్!... తిరుగుటపాలో ఎర్రమంజిల్ కోర్టుకే వచ్చేసిన వారెంట్లు

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. శంషాబాదు ఎయిర్ పోర్టు నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న జీఎంఆర్ సంస్థకు మాల్యా విమానయాన సంస్థ కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ బకాయి పడిన సంగతి తెలిసిందే. ఈ బకాయిలను క్లియర్ చేసేందుకు మాల్యా ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జీఎంఆర్ కోర్టుకెక్కింది. ఈ కేసును విచారించిన ఎర్రమంజిల్ కోర్టు మాల్యాను దోషిగా తేల్చింది. అయితే, నిందితుడు హాజరుకాకుండా శిక్ష విధించలేమన్న కోర్టు... కోర్టుకు రావాలంటూ మాల్యాకు వారెంట్లు జారీ చేసింది. ఈ వారెంట్లు తిరుగుటపాలో ఎర్రమంజిల్ కోర్టుకే వచ్చేశాయి. వారెంట్లను చేతబట్టుకుని వాటిలోని అడ్రెస్ కు వెళ్లిన విలేపార్లే పోలీసులు అక్కడ ఎవరూ లేకపోవడంతో సదరు వారెంట్లను కోర్టుకే తెచ్చి ఇచ్చారు. వారెంట్లలో పేర్కొన్న అడ్రెస్ లోని ఇంటిని బ్యాంకు అధికారులు సీజ్ చేశారని చెప్పిన విలేపార్లే పోలీసులు... అందులో ఏ ఒక్క వ్యక్తి లేరని కోర్టుకు తెలిపారు.

More Telugu News